5 మార్చి, 2012

ఆమె లేకుంటేనేం? ఆ ముగ్గురు భామలతో ప్రభుదేవా..!

                                       Prabhu Deva


కొరియో గ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్లో ‘రౌడీ రాథోర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రానికి రీమేక్. రౌడీ రాథోర్ చిత్రంలో ఐటం సాంగు కోసం తొలుత బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్‌ను అనుకున్నారు. అయితే భోజ్ పురి స్టయిల్‌లో రూపొందించనున్న ఈ ఐటం సాంగులో నర్తించడానికి ఆమె తిరస్కరించిందట. 

ఎవరు ఎంత ప్రయత్నించినా ఆమెను ఒప్పించలేక పోయారు. ఆ తర్వాత హాట్ లేడీ జియాఖాన్‌ను తీసుకోవాలని ప్రయత్నించినా.....జీరో సైజ్ కోసం ఆమె బాగా చిక్కి పోవడంతో మాస్ మసాలా పాటకు ఆమె సూట్ కాదని తేల్చేశాడట దర్శకుడు ప్రభుదేవా. 

చివరకు ఈ పాట కోసం ముగ్గు హాట్ ఐటంగర్ల్స్‌ని ఎంపిక చేశారు. దియ్యాలో పాటతో తెగ ఊపిన మరియమ్ జకారియం, ముమైత్ ఖాన్, శక్తి మోహన్ ను ఎంపిక చేశారు. దర్శకుడు ప్రభుదేవా కూడా ఈ విషయం స్పష్టం చేశారు. కరిష్మా లేకుంటేనేం? ఈ ముగ్గురు భామలు ఉన్నారు కదా అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాడట.

కామెంట్‌లు లేవు: