5 మార్చి, 2012

ఢిల్లీలో భూకంపం, పార్లమెంట్‌నుండి బయటకు ఎంపీలు

                                       
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో స్వల్ప భూకంపం వచ్చింది. న్యూఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పైన 5.1గా నమోదయింది. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్‌లలో భూకంపం వచ్చింది. పార్లమెంటు భవనం స్వల్పంగా కంపించింది. పార్లమెంటు సిబ్బంది బయటకు పరుగులు తీసింది. రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉన్న మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ బయటకు వచ్చారు. భూమి పదకొండు సెకన్ల పాటు కంపించింది.

భూమి కంపనం కారణంగా కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇళ్లలో ఉన్న వారు రోడ్డు పైకి పరుగులు తీశారు. హర్యానాలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గలేదు. భూకంపం తగ్గిన తర్వాత కొందరు తమ పనులు తాము చేసుకుంటుండగా మరికొందరిలో మాత్రం భయం తగ్గలేదు.

కామెంట్‌లు లేవు: