7 మార్చి, 2012

సునీల్ చిత్రానికి టైటిల్ కష్టాలు!

                                            Sunil
బాలీవుడ్‌లో మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన ‘తను వెడ్స్ మను’ చిత్రం ఆధారంగా సునీల్ హీరోగా తెలుగులో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దేవి ప్రసాద్ దర్శకుడు. ఇషా చావ్లా కథానాయిక. ఈ నెల 26న ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ‘సీతా వెడ్స్ రాముడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని ప్రాచారం జరుగుతోంది. 

ఇదే నిజమైతే...టాలీవుడ్‌లో మరో టైటిల్ వివాదం తెరపైకి రాబోతోంది. ఎందుకంటే ‘సీతా వెడ్స్ రాముడు’ అనే టైటిల్‌ను నిర్మాత నట్టి కుమార్ విశాఖ టాకీస్ బ్యానర్‌పై ఇప్పటికే రిజిస్టర్ చేయించారని చర్చించుకుంటున్నారు. అదే జరిగితే సునీల్‌కు టైటిల్ కష్టాలు తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మరేం జరుగబోతోందో చూడాలి.

సునీల్ నటించిన ‘పూలరంగడు’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. వీరభద్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ బ్యానర్‌పై అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కామెంట్‌లు లేవు: