* ఈ నెల 16న ఐరాసలో ప్రసంగం
సినీ నటి కుష్భూకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి యువజన విభాగ సమావేశంలో ప్రసగించే అవకాశం లభించింది. నైరోబీలో ఈ నెల 16, 17న జరిగే ఈ కార్యక్రమానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. యువత సంక్షేమంపై చర్చించనున్నారు. ఈ అంశంతో పాటు మహిళా అభివృద్దికి అమలు చేయాల్సిన చర్యలపై కుష్భు మాట్లాడనున్నట్టు సమాచారం. ఈ నెల 14న చెన్నై నుంచి విమానంలో నైరోబీ చేరుకోనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి