విజయవాడ: తమ సోదరుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో తమకు ఏ విధమైన విభేదాలు లేవని నందమూరి హీరో తారకరత్న స్పష్టం చేశారు. తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయంలో ఆయన సోమవారం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తామంతా కలిసి తెలుగుదేశం పార్టీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామని, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన చెప్పారు.
రాజకీయాల్లో మామయ్య చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలయ్య నిర్ణయాలే ఫైనల్ అని ఆయన అన్నారు. తమ పార్టీకి ఏది మేలు చేస్తుందని వారు నిర్ణయాలు తీసుకుంటే వాటికి అనుగుణంగా పని చేస్తామని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలున్నట్లు కల్పంచారని, ఈ విషయంలో ఏదైనా అడగదలుచుకుంటే వాటిని కల్పించినవారినే అడగాలని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావడానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంకా అనుభవం కావాలని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చెప్పిన నేపథ్యంలో తారకరత్న మాటలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి