ప్రపంచతీవ్రవాది, అల్‌ఖైదా తీవ్రవాదసంస్థ నాయకుడూ అయిన బిన్ లాడెన్ గత సంవత్సరం మే2 వ తేదీన పాకిస్థాన్‌లో అమెరికా సేనల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించలేదు. దక్షిణ అరేబియా సముద్రంలో ఇస్లామ్ ఆచారం ప్రకారం ఖననం చేసినట్టు ప్రకటించారు.
కానీ, అతని మృతదేహం సముద్రంలో ఖననం చేయలేదనీ, అమెరికాకు తీసుకు వెళ్ళబడి అక్కడ ఖననం చేయబడినట్టు ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగుచూసింది. బిన్ లాడెన్ చంపబడిన వెంటనే పాకిస్థాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముస్లింల ఆచార ప్రకారం అతనికి అంత్యక్రియలు చేయబడ్డాయి.
తర్వాత అతని మృతదేహం భద్రతతో "ప్యాకింగ్" చేయబడి "సి.ఐ.ఎ." విమానంలో అమెరికాలోని మిలిటరీ స్థావరానికి తీసుక వెళ్ళబడింది. తర్వాత అక్కడ ఖననం చేయబడింది. ఈ సమాచారాన్ని ఆ సమయంలో "స్ట్రాట్ ఫోర్" సంస్థకి ఇ-మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు "వికీలీక్" అనుబంధ సంస్థకి రహస్యంగా లభించాయి.
అక్కడి నుంచి అవి, సమాచారాలనూ, ఫోటోలనూ దొంగిలించే ముఠాకి దొరికాయి. వాళ్ళు ఆ సమాచారాన్ని అమెరికా నుంచి వెలువడే ఒక పత్రికకి ఇచ్చి ప్రచురింపజేశారు.ఈ వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి