8 మార్చి, 2012

కొత్త జైలోను టెస్ట్ డ్రైవ్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి

                      Mahindra Xylo Contestమైక్రా కారు కోసం నిస్సాన్ టెస్ట్ డ్రైవ్ ఆఫర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌లో భాగంగా నిస్సాన్ మైక్రా కారును టెస్ట్ డ్రైవ్ చేసిన వారు లక్కీ డ్రాలో ఆరు వారాల పాటు ఆరు కొత్త మైక్రా కార్లను గెల్చుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇలాంటి ఓ కాంటెస్ట్‌ను ఆఫర్ చేస్తుంది. "హ్యాపీ డ్రైవ్స్ కాంటెస్ట్" పేరుతో మహీంద్రా కొత్త జైలో కోసం కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇందులో భాగంగా కొత్త జైలోను టెస్ట్ డ్రైవ్ చేసిన వారిని, కంపెనీ తీసే లక్కీడ్రాలో ఓ 2012 జైలో వరిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ సమీపంలో డీలర్ వద్దకు వెళ్లి కొత్త జైలోను టెస్ట్ డ్రైవ్ చేసి స్లోగన్ కాంటెస్ట్ కోసం ఫారమ్‌ను పూర్తిచేస్తే సరిపోతుంది. ఏమో అదృష్టం మీ తలుపు తట్టొచ్చేమో.

ఇక సరికొత్త మహీంద్రా జైలో ఎమ్‌పివి విషయానికి వస్తే.. పాత జైలోతో పోల్చుకుంటే దాదాపు 50 మార్పులతో ఈ ఎమ్‌పివిని రూపొందించడం జరిగింది. 2012 వెర్షన్ జైలో ఎమ్‌పివి డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించనుంది. హైదరాబాద్ మార్కెట్లో కొత్త జైలో ధరలు రూ.7.37 లక్షల నుండి రూ.10.24 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

కొత్త మహీంద్రా జైలో ఈ9 వేరియంట్‌లో స్కార్పియోలో ఉపయోగించే 2.2లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ4, ఈ8 వేరియంట్లలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ 112 బిహెచ్‌పిల శక్తిని, డి2, డి4 వేరియంట్లలో ఉపయోగించిన ఎమ్‌డిఐ ఇంజన్ 95 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఐదు వేరియంట్లలో లభ్యమయ్యే కొత్త జైలో ఎమ్‌పివి వేరియంట్‌ను బట్టి లీటరుకు 13-15 కి.మీ. మైలేజీనిస్తుంది.

కామెంట్‌లు లేవు: