8 మార్చి, 2012

మీరు సైకిల్ పార్టీనా లేక మోటార్‌సైకిల్ పార్టీనా..!

                   Cycle Riding
మీరు సైకిల్ పార్టీనా లేక మోటార్‌సైకిల్ పార్టీనా..! మీరు ఏ పార్టీ అయినా సరే, మోటార్ వాహన విభాగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన 'సైకిల్' ఇప్పుడు తెరమరుగై పోతుంది. మారుతున్న కాలంతో పాటుగానే వాహన ప్రియుల అభిరుచులు కూడా మారిపోతున్నాయి. వాస్తవానికి సైకిల్ తొక్కడం వలన చాలానే ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దామా..!!

1. ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. దీని వలన పర్యావరణానికి ఎలాంటి హాని లేదు. ఫలితంగా మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారిని కూడా ఆరోగ్యంగా ఉంచిన వారవుతారు.
2. ఇంధన ఖర్చు అస్సలుండదు, ఫలితంగా చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
3. మెయింటినెస్స్ ఖర్చు చాలా చాలా తక్కువ.
4. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది, ముఖ్యంగా గుండె, కండరాలకు ఇది చాలా మేలు చేస్తుంది.
5. ఎంత రద్దీ రోడ్లపై అయినా జర్రుమంటూ వెళ్లిపోవచ్చు.
6. సిటీల్లో తక్కువ దూరాలు ప్రయాణించే వారికి సైకిల్ చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే, సిటీ రోడ్లపై మోటార్‌వాహనాల్లో మహా అయితే 35-40 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లలేం. అయితే, సైకిల్ అయితే, ఎంత స్పీడ్‌గా తొక్కితే అంత వేగంగా వెళ్లవచ్చు.
7. కొన్ని ప్రాంతాల్లో అయితే పార్కింగ్ సమస్య ఉండదు, పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరమూ ఉండదు.
8. రోజూ పనికి/ఆఫీసుకి సైకిల్‌పై వెళ్లినట్లయితే, ప్రత్యేకించి వ్యాయామం (ఎక్సర్‌సైజ్) కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. దీని ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది.
9. సైకిల్‌పై నెమ్మదిగా వెళ్తాం కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాకుండా మన చుట్టూ ఉండే అందాలను ఆస్వాదిస్తూ జాయ్‌ఫుల్‌గా రైడ్ చేయవచ్చు. అదే మోటార్‌వాహనంలో అయితే ఈ సదుపాయం ఉండదు.
10. ఇక చివరిగా... ప్రతి రోజూ సైకిల్ తొక్కడం వలన మీరు భౌతికంగా, మానసికంగా హాయిగా ఉంటారు.

కామెంట్‌లు లేవు: