7 మార్చి, 2012

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు మరో షాక్‌

                                    AA
అప్పుల ఊబిలో కూరుకుపోయి తంటాలు పడుతున్న కింగ్‌ఫిషర్‌ ఏర్‌లైన్స్‌కు మరో కష్టం వచ్చి పడింది. బకాయిలు చెల్లించకుంటే టికెట్లు అమ్మేది లేదని ట్రావెల్‌ ఏజెంట్ల సంఘం తేల్చిచెప్పింది. ఏప్రిల్‌ ఒకటో తేదీని గడువు విధించింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న కింగ్‌ఫిషర్‌.. సర్వీసుల్ని పూర్తిస్థాయిలో నడపలేకపోతోంది. 

మరోవైపు.. పన్ను బాకీ చెల్లించాలని సంబంధిత అధికారులు ఏకంగా అకౌంట్లనే స్తంభిపచేస్తున్నారు. ఇప్పుడు ట్రావెల్‌ ఏజెంట్ల సమస్య వచ్చి పడింది. అప్పులోళ్లు మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో.. సంస్థ యాజమాన్యానికి చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ల అమ్మకాలు ఆగిపోకుండా ఏజెంట్ల సంఘంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 

కామెంట్‌లు లేవు: