చేసేది చిన్న ఉద్ద్యోగం. రోజూ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అటువంటి స్థితిలో అనారోగ్యంతో మంచం పట్టాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. తనపై ఆధారపడ్డ కుటుంబ పోషణ, మరోవైపు వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయనే హైదరాబాద్ మల్కాజ్గిరి కి చెందిన ప్రసాద్
ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకునేవాడు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటే ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని, రెండోకిడ్నీ ప్రాథమిక దశలో ఉఉన్నందున కిడ్నీ మార్చడం అనివార్యమని డాక్టర్లు సూచించారు. కిడ్నీ మార్పు చేసేందుకు సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అప్పటి వరకు వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో వారానికి రెండు సార్లు గాంధీ ఆస్పత్రిలో ప్రసాద్ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ ఉచితంగానే చేస్తున్నా మందుల కోసం నెలకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. డయాలసిస్ కూడా ఎక్కువ రోజులు చేయించుకోరాదని, త్వరగా కిడ్నీ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారని, కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఆరు లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొచ్చేదని బాధితుడు వాపోతున్నాడు. తనకు ఎవరైనా దాతలు సహకరించి ఆర్థిక సాయం చేస్తే చికిత్స చేసుకునేవీలుందని వేడుకుంటున్నాడు. మరి దాతలు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకురావాలని కోరుకుందాం.
సంప్రదించండి: ప్రసాద్ సెల్ న:s.verra prasad
a/c no
Bank of india,Malkajgiri branch
Andhra pradesh
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి