15 జూన్, 2012
రామ్ చరణ్ పెళ్లిలో... షాకింగ్ లుక్‌తో నాగార్జున
షిరిడి సాయి షూటింగ్ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు తెల్లగడ్డం, సాదాసీదా హెయిర్ స్టయిల్‌తో కనిపించిన హీరో నాగార్జున....రామ్ చరణ్ పెళ్లి వేడుకలో షాకిచ్చే లుక్‌తో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్య పరిచాడు. టాలీవుడ్ నిన్నటి తరం హీరోల్లో గ్లామర్ విషయంలోనూ, స్టైల్ విషయంలోనూ నాగార్జునకు ఎవరూ సాటిరారు. ఏ కార్యక్రమానికి హాజరైనా తన డ్రెస్సింగ్‌తో ప్రత్యేకత చాటుకుంటూఉంటారు. చరణ్ పెళ్లికి కూడా నాగ్ డిఫరెంట్ లుక్‌తో వస్తాడని మీడియా వారంతా ఆయనపై దృష్టి పెట్టారు. సాదా సీదా ఆశ్చర్యం కాకుండా....ఓ రేంజిలో నేరెల్లబెట్టేలా షాకింగ్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆయన్ను చూసి వారంతా హాలీవుడ్ హీరోలా ఉన్నారని కొందరంటే..రాక్ స్టార్ కనిపిస్తున్నారని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నాగార్జున నటించిన డమరుకం, షిరిడి సాయి చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శరత్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం పేరు ‘లవ్ స్టోరీ'. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 20నుంచి మొదలు కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్ంర ‘షిరిడి సాయి'. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ని ఈ నెల 25వ తేదీన జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గతంలో రాఘవేంద్రరావు, నాగర్జున కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల లాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.
నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ రూపొందించిన చిత్రం ‘డమరుకం' చిత్రానికి పెద్ద చిక్కే వచ్చి పడినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లెవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. నాగార్జున కెరీర్లోనే ఈచిత్రం భారీ బడ్జెట్‌తో దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టి భారీ గ్రాఫిక్స్ కలగలిపిన సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించారు. అసలు తెలుగు సినిమా రేంజికే ఇది భారీ బడ్జెట్. వాస్తవానికి నాగార్జునకు రూ. 20 కోట్లకు మించిన మార్కెట్ లేదని, అలాంటి పరిస్థిత్లుల్లో అంతకు రెండింతలు ఖర్చు పెట్టి తీయడం ఏమిటని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి