బాలుడి వేళ్లు నమిలిన మహిళ: జైలులో సంఘటన
అజ్మీర్: నాలుగేళ్ల బాలుడి వేళ్లను నమిలిన 35 ఏళ్ల మహిళ ఉదంతం అజ్మీర్ సెంట్రల్ జైలులో బుధవారం చోటు చేసుకుంది. తన కుమారుడిని రైలు నుంచి తోసిసేన కేసులో బర్ఫీ అనే మహిళ జైలులో ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న మరో మహిళతో ఆమె కుమారుడు ఉంటున్నాడు. బర్ఫీ బారి నుంచి తన కుమారుడిని కాపాడడానికి ఆ మహిళ ప్రయత్నించింది. ఆ సమయంలో బర్ఫీ ఆ మహిళపై కూడా దాడి చేసింది.
బర్ఫీపై జైలు అధికారులు సివిల్ లైన్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసి, బాధితులను జెఎల్ఎన్ ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో సల్మా తన ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఆమె కుమారుడు అర్మాన్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బర్ఫీ అర్మాన్‌పై దాడి చేసింది. బర్ఫీ తన కుమారుడిని చూసి కొట్టడం ప్రారంభించిందని, ఆ తర్వాత అతని వేళ్లను నమిలిందని సల్మా చెప్పింది.
బర్ఫీ తనపై దాడి చేయడంతో అర్మాన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అప్పటి నుంచి అతని నోట మాట రావడం లేదు. నెల రోజుల క్రితం బర్ఫీ జైపూర్, అజ్మీర్ మధ్య తన కుమారుడిని రైలు నుంచి తోసేసింది. పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన తర్వాత ఓ మూల గంటల విచారంగా కూర్చుంటూ ఉండేది. అర్మాన్‌ను చూస్తే మండిపోయేదని అంటున్నారు.
అధిక బరువు వెంటనే తగ్గాలంటే?
1. వీరి ఆహారంలో బ్రౌన్ రైస్ తప్పక వుంటుంది. కొద్దిపాటి చికెన్, చేప కూడా చేరుస్తారు.
2. తాజాపండ్లు, ప్రత్యేకించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే అవకాడోవంటి పండ్లను తింటారు.
3. బరువుతగ్గాలంటే జంక్ ఫుడ్ పక్కన పెట్టాల్సిందే. అయితే, టర్కీ బర్గర్ వంటి ఆరోగ్య తిండి తినవచ్చు.
4. బ్రిట్న స్పియర్ మరో ఆహార విధాన రహస్యం ఆమె కొద్ది కొద్ది ఆహారాన్ని తరచుగా తింటుంది. అందరిలా 3 ఎక్కువ భోజనాలు కాక అయిదు మార్లుగా తక్కువ తక్కువగా తింటుంది.
5. వీరి భోజనంలో ప్రొటీన్ అధికంగా వుండే, గుడ్లు, చికెన్, టోఫు, సల్మాన్ చేప, పచ్చని కూరగాయలు తప్పక వుంటాయి.
6. బరువు తగ్గాలనుకునే వీరు. వెన్న తీసిన పాలు మాత్రమే తాగుతారు.
7. ఆల్కహాలు వంటి పానీయాలు వదిలేసి ఆరోగ్యకరమైన పండ్లరసాలే తాగాలి.
8. బ్రిట్నీ స్పియర్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. అందువలన కూడా ఈమె బరువు త్వరగా తగ్గింది.
బ్రిట్నీ స్పియర్ త్వరగా బరువు తగ్గటంలో వున్న రహస్యం ఆమె చేపట్టిన ఆహారా విధానం మాత్రమే. కనుక త్వరగా బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో మార్పులు చేసుకుంటూ తగిన వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
టెక్కీలను ఉద్యోగాల పేరుతో మోసం ముఠా అరెస్టు
వారి సెల్‌ఫోన్ల ద్వారా, ఇ - మెయిల్ ఐడిల ద్వారా పంపిన సమాచారాన్ని ఆధారం చేసుకుని వారిని అరెస్టు చేశారు. నిరుద్యోగులను ఫోన్, ఇమెయిల్ ద్వారా శ్రీలక్ష్మి సంప్రదిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు సైబర్ క్రైమ్ అదనపు ఎస్పీ యు. రామ్మోహన్ చెప్పారు. హైదరాబాదులోని వివిధ జాబ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 2011 జూన్‌లో రెజ్యూమ్ పంపించాడని, శ్రీలక్ష్మి అతనికి ఆఫర్ లెటర్ పంపిందని, అదే నిజమేనని నమ్మి అతను ప్రాసెసింగ్ చార్జీల కింద ఆనంద్ బ్యాంక్ ఖాతాలో 1.6 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడని, మోసం జరిగిందని అతను గ్రహించాడని ఆయన వివరించారు.
శ్రీలక్ష్మి ఇచ్చిన ఆఫర్ లెటర్‌తో సంప్రదిస్తే ఐబిఎం తాము ఇవ్వలేదని తిరస్కరించిందని ఆయన చెప్పారు. ఐబిఎం సైన్ బోర్డులున్న పూణేలోని భవనాల్లో శ్రీలక్ష్మి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినట్లు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ చెప్పారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి