నేపాల్‌లో సాధువుగా భాను కిరణ్?
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ నేపాల్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. ఈ మేరకు సోమవారం వార్తలు వచ్చాయి. నేపాల్‌లో అతను సాధువు వేషంలో సంచరిస్తున్నాడట. దీంతో అతనిపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. భాను కిరణ్ కోసం ఏడాది నుంచి మన దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గాలించారు. కానీ ఫలితం లభించలేదు. నోయిడా, ఢిల్లీ ప్రాంతాల్లో అతను దొరికినట్లే దొరికి తప్పించుకుని పోయాడని అంటున్నారు.
అప్పటి నుంచి భాను కిరణ్ ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇదిగో పులి కథలాగా అయిపోయింది. నేపాల్ రాజధాని ఖాట్మండు ప్రాంతంలో అతను సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెబుతున్నారు. బీహార్ మీదుగా భాను కిరణ్ నేపాల్‌కు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి