|
కృష్ణా: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి వచ్చిన పేమజంటకంగారులోకర్పూర జ్యోతిని హుండీలో పడవేశారు. దీంతో హుండీలోని డబ్బులు కాలిపోయాయి. కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలులో ఈ ఘటన చోటుచేసుకుంది. హుండీలో నుంచి పోగలు రావడంతో ఆలయ సిబ్బంది గమనించి నీళ్లు పోశారు. హుండీలోని వేలాది రూపాయిల భక్తుల విరాళాలు దగ్ఢమై ఉంటాయని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన ఆ ప్రేమజంట అప్పటికే అక్కడినుంచి నిష్ర్కమించడంతో సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరపాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
|
4 ఫిబ్ర, 2012
అమ్మవారి సన్నిధిలో అపశృతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి