13 ఫిబ్ర, 2012

ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీకి బాబు పాదయాత్ర

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ నుంచి శాసనసభ వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారు. ఆయన సోమవారం ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో పాటు శాసనసభ్యులు, కార్యకర్తలు పాదయాత్ర చేశారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. విధులు నిర్వహించడంలో గవర్నర్ నరసింహన్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి తన రిమాండ్ రిపోర్టులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరు చేర్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలోని దౌర్భాగ్య పరిస్థితికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్సించారు. ప్రభుత్వ చర్యలను శాసనసభ ఎండగడుతామని ఆయన అన్నారు. తమకు చెప్పకుండా భూకేటాయింపులపై విచారణకు వేసిన సభా సంఘంలో తమ పార్టీ సభ్యులను వేయడం సరి కాదని ఆయన అన్నారు. పైగా బిక్షమెత్తినట్లు ఇద్దరు సభ్యులను మాత్రమే సభా సంఘంలో వేశారని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు: