* స్వాధీనం చేసుకున్న సొత్తులో కొంత దాచేశారని ఆరోపణ
* మీడియా సాక్షిగా చెప్పడంతో అవాక్కయిన పోలీసులు
అతడో దొంగ, పోలీసులకు చిక్కి బుక్కయ్యాడు. అయితే తనను అరెస్టు చేసిన పోలీసులే దొంగలుగా మారడంతో తట్టుకోలేక మీడియా సాక్షిగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసుల బండారాన్ని బయటపెట్టాడు. తన దగ్గరనుంచి రెండు కిలోల బంగారాన్ని, పదిలక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారని, అయితే రికవరీ మాత్రం పదకొండు వందల గ్రాముల బంగారం, మూడున్నర లక్షల నగదుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టాడు. అలీఖాన్, రవూఫ్, అశోక్ అనే ముగ్గురు నిందితులను నారాయణ గూడ పోలీసలు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడంతో పోలీసుల బండారం బయటపడింది. మీడియా ముందే దొంగ పోలీసుల చిట్టా విప్పడంతో అవాక్కవ్వడం పోలీసుల వంతైంది.

2 కామెంట్లు:
హహహ ఇది అందరికి తెలిసిన విషయమే.. కాని పట్టుకున్న దొంగ చెప్పటం న్యూ.. అందరు దొంగలు ఇలా చెప్పితే పోలీసు లో దొంగలు బయట పడుతారు లేకపోతె దొంగలు దొరికితే రీకవరి చేసిన దానిలో 90% పోలీసు లే మేస్తున్నారు 10% బయటకు చూపెడుతున్నారు..
Yes, Its 100% correct.
కామెంట్‌ను పోస్ట్ చేయండి