తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత ఆమోదం కోసం తమిళనాడులో ఓ పెళ్లి ఆగిపోయింది. అయితే, ఆ పెళ్లి జరగడానికి జయలలిత ఆమోదం లభించాల్సి ఉంటుంది. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు రెండు వేర్వేరు పార్టీలకు చెందిన కుటుంబాలకు చెందినవారు కావడమే అందుకు కారణం. 26 ఏళ్ల లాస్య, 30 ఏళ్ల నవీన్ పెళ్లి కావాలంటే తప్పకుండా జయలలిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఎండి చదువుతున్న లాస్య అన్నాడియంకె నేత, లోకసభ మాజీ ఉప సభాపతి తందిదురై కూతురు కాగా, శ్రీరామచంద్ర వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నవీన్ కాంగ్రెసు నాయకుడు, నాలుగు దఫాలు శాసనసభ్యుడిగా ఉన్న జ్ఞానశేఖరన్ కుమారుడు.
వారిద్దరికి 2010 నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. కానీ వివాహమే ఆలస్యం అవుతోంది. పెళ్లికి ప్రత్యర్థులైన కాంగ్రెసు, డిఎంకె నాయకులు వస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జయలలిత అంగీకరిస్తారా లేదా అనే ఉద్దేశంతో తుంబిదురై ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఈ విషయంపై జయలలితతో మాట్లాడడానికి కూడా వెనకాడుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది.
పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లి చేసుకోవచ్చునని, తాను రిసెప్షన్ పెడతానని, దీనికి తన మిత్రులను ఆహ్వానిస్తానని జ్ఞానశేఖర్ అంటున్నట్లు ఆ దినపత్రిక రాసింది. లాస్య ఎంబిబిఎస్ చదువుతుండగా అక్కడే రేడియోలజీలో ఎండి చేస్తున్న నవీన్‌తో పరిచయమై అది ప్రేమగా మారి, వివాహం దాకా వచ్చింది. వారిద్దరు బంధువులు కూడా అవుతారు. వారి పెళ్లికి రాజకీయాలు తప్ప మరేమీ అడ్డు రావడం లేదు. అడ్డంకులను తొలగించుకోవడానికి లాస్యనే ముందుడుగు వేసింది. ఆమె వారం రోజుల క్రితం పోయెస్ గార్డెన్‌కు వెళ్లి తన పెళ్లి విషయమై అపాయింట్‌మెంట్ కావాలని కోరింది. జయలలిత మన్నిస్తారని ఆ ప్రేమజంట గట్టిగా నమ్ముతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి