జైపూర్: వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని రాజస్థాన్ హైకోర్టు బాలీవుడ్ నటుడు సన్నీ డయెల్‌ను ఆదేశించింది. తన చిత్ర నిర్మాణం సందర్భంగా 1997లో రైలును అక్రమంగా అపినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
వ్యక్తిగతంగా హాజరు కావడంపై మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సన్ని డయెల్ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు డిస్మిస్ చేసింది. బజరంగ్ సినిమా షూటింగ్ సందర్భంగా పురులియాలోని నరేనా రైల్వే స్టేషన్ నుంచి కదిలిన రైలును అక్రమంగా ఆపేశారని సన్నీ డయెల్, కరిష్మా కపూర్, స్టంట్‌మ్యాన్ వర్మలపై, మరో వ్యక్తిపై కేసు నమోదైంది.
నటుడు సన్నీ డయెల్ చట్టానికి అతీతులు కారని, కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్ర దర్శకుడు చైన్ లాగి ఆపేయడం వల్ల రైలు 25 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిందని స్టేషన్ మాస్టర్ కేసు దాఖలు చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి