జన్మనిచ్చిన తల్లి ఆ చిన్నారిని వదిలేసింది. వేలు పట్టుకుని నడిపించాల్సిన తండ్రి తాగుడు కోసం బిడ్డను అమ్ముకున్నాడు. అభంశుభం తెలియని వయసులో పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ పాపను గ్రామస్థులు చేరదీశారు. ఇలా అనాధగా మిగిలిన ఓ బాలిక ఇప్పుడు సంరక్షకుల కోసం ఎదురు చూస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్ అనే తాగుబోతు ఇద్దరు పిల్లలతో ఇటీవలే కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు ఎస్సీ కాలనీలో సెటిలయ్యాడు.
తాగుడును భరించలేని అతని భార్య భర్తను, పిల్లలను వదిలేసి తనదారి తను చూసుకుంది. మద్యానికి బానిసైన వెంకటేశ్ తన ఐదేళ్ల కూతురు వినీతను బద్వేల్ పట్టణంలో బాలమ్మ అనే మహిళకు 5,300 రూపాయలకు తెగనమ్మాడు. వచ్చిన డబ్బుతో జల్సా చేస్తుండగా కూతురు కనిపించకపోవడంతో కాలనీ వాసులు నిలదీశారు. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వెంటనే వారంతా చందాలు పోగేసుకుని బాలమ్మ దగ్గరకు వెళ్లి వినీతను విడిపించుకుని వచ్చారు. ఇప్పుడా చిన్నారి గ్రామస్థుల సహకారంతో ఏ చీకూ చింతా లేకుండా స్కూల్‌కు వెళతోంది.అయితే ఎంతకాలం తాము ఇలా బాలికను కాపాడగలమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వచ్చి బాలిక సంరక్షణను చేపట్టాలని కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి