9 ఫిబ్ర, 2012

చికిత్స ఆలస్యానికి కారణం నేనే : యువరాజ్ సింగ్ వెల్లడి




yuvaraj singh









తాను బాధపడుతున్న ఊపిరిత్తుల క్యాన్సర్‌కు చికిత్స చేయించుకునే అంశంలో నెలకొన్న జాప్యానికి తానే కారణమని భారత మిడిల్ ఆర్డర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో తన గురువుతో పాటు.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును విమర్శించవద్దని ఆయన కోరారు. 


ఇదే అంశంపై ట్విట్టర్‌లో యువరాజ్ సింగ్ స్పందిస్తూ... తాను కష్ట కాలంలో ఉన్న సమయంలో బీసీసీఐ సభ్యులంతా తనకు అండగా నిలబడ్డారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే తాను చికిత్స తీసుకునే అంశంలో ఏర్పడిన జాప్యానికి కారణం తానేనని ఆయన చెప్పారు. 

కాగా, ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ ఇనిస్టిట్యూట్‌లో కీమోథెరపీకి యువరాజ్ సింగ్ ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్న విషయం తెల్సిందే.






కామెంట్‌లు లేవు: