4 ఫిబ్ర, 2012

హీరోయిన్ జెనీలియా సెకండ్ మ్యారేజ్!

హీరోయిన్ జెనీలియా నిన్న తన కోస్టార్ రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అమ్మడు ఈ రోజు రెండో సారి పెళ్లి చేసుకోబోతుంది. కొంపతీసి ఈ రెండో పెళ్లిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. రితేష్ దేశ్‌ముఖ్ మరాఠీ హిందూ కాబట్టి నిన్న మరాఠీ సంప్రదాయంలో ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే జెనీలియా హిందూ కాదు. ఆమె రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. దీంతో వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఈ రోజు చర్చిలో వీరి వివాహం రెండో సారి జరుగబోతోంది. బాంద్రాలోని ఓ పెద్ద చర్చిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

నిన్న మరాఠీ సాంప్రదాయంలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, సునీల్ శెట్టి, అశుతోస్ గోవర్కర్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, అసిన్, షాజిద్ ఖాన్, సాజిద్ నడియావాలా, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, సుభాష్ గై తదితరులు హాజరయ్యారు. 

రాణా-జనీలియా జంటగా నటించిన నా ఇష్టం సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటి వరకు జెనీలియా సౌత్ సినిమాల్లో చేసిన చివరి సినిమా కూడా ‘నా ఇష్టం’ కావడం గమనార్హం. పెళ్లి తర్వాత జెనీలియా హీరోయిన్‌గా నటించినా....ఇప్పటికే దక్షిణాది సినిమాలు దాదాపుగా దూరంగా ఉంటున్న ఆమె పెళ్లి తర్వాత ఇటు వైపు చూసే అవకాశాలు లేవంటున్నారు ఇక్కడి సినీ వర్గాలు. ఆమె ఈ సంవత్సరం హిందీలో ఇట్స్ మై లైఫ్, తెరే నాల్ లవ్ హోగయా, రాక్ ద షాది, బ్లడీ పాకి చిత్రాలకు కమిట్ అయింది. ఈ సినిమాల షూటింగులు ఇంకా పూర్తి కాలేదు. 

కామెంట్‌లు లేవు: