17 ఫిబ్ర, 2012

ఫెయిల్యూర్ సినిమా! ('లవ్ ఫెయిల్యూర్' రివ్యూ)

లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్ ‘లవ్ ఫెయిల్యూర్’ అంటూ భిన్నమైన సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో నిర్మాతగా మారి ఈ సినిమాలో పెట్టుబడి కూడా పెట్టాడు. మరి సిద్ధార్థ్ అంత ఎగ్జైట్మెంట్ చేసిన ఈ సినిమాలో ఏముందే రివ్యూలో పరిశీలిద్దాం...

కథ: అర్జున్(సిద్ధార్థ), పార్వతి(అమలపాల్) ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి హైయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లాలని అందుకు సంబంధించి ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. ఇక అర్జున్ పార్వతిని మరిచి పోవడానికి తన ఫ్రెండ్స్ తో గడుపుతుంటాడు. పార్వతి పేరెంట్స్ అరవింద్(సురేష్), సరు(సురేఖవాణి)ల లవ్ స్టోరీ ఈ యువ జంటలో మార్పు తెస్తోంది. మరి వీరి లవ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్ ఏమిటి? అర్జున్, పార్వతి లవ్.... ఫెయిల్యూర్ గానే మిగిలి పోయిందా? సక్సెస్ అయిందా? అనేది తెరపై చూడాల్సిందే. 

పెర్ఫార్మెన్స్: లవర్ బాయ్ పాత్రలో సిద్దార్థ రొటీన్ గా కనిపించాడు. అసలు అతడి క్యారెక్టర్లో ఎనర్జీ అనేదే లేదు. సిద్దార్థ కంటే అమలపాల్ బెటర్ గా నటించింది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు అలా అలా కానిచ్చేశారు. 

టెక్నికల్ అంశాలు: కొత్త దర్శకుడు బాలాజీ మోహన్ దర్శకత్వ లేమి స్పష్టంగా కనిపించింది. సినిమా స్క్రిప్టును హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నటీ నటుల నుంచి ఎమోషన్ సీన్స్ ను తగిన విధంగా రాబట్టడంలో విఫలం అయ్యాడు. డ్యాకుమెంటరీ తరహాలో ఉండే స్క్రీన్ ప్లే విసుగు పుట్టిస్తుంది. తమన్ అందించిన సంగీతం బాగానే ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చెత్తగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కాస్టూమ్స్ ఫర్వాలేదనే విధంగా ఉన్నాయి. 

మొత్తం మీద సినిమా ఓ రోటీన్ లవ్ స్టోరీ. బలహీనమైన కథనం. కేవలం కాలేజీ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన సినిమా. ఈ సినిమా వారిని కూడా పూర్తి గా సంతృప్తి పరచడం కష్టమే. సినిమా టైటిల్ కు తగిన విధంగానే సినిమా కూడా ఫెయిల్యూర్ అనే రీతిలో ఉంది.

కామెంట్‌లు లేవు: