హైదరాబాద్: మీడియా ముందు మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పినవన్నీ వాస్తవాలేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం చెప్పారు. డిఎల్ చేసిన వాదనలో వాస్తవముందని ఆయన అభిప్రాయపడ్డారు. డిఎల్ రాజీనామా చేయనని చెప్పారని, ఇంతటితో ఈ అంశం సమసిపోయిందని ఆయన అన్నారు. మంత్రి మోపిదేవి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. ఆయన తప్పు చేశాడని తాను భావించడం లేదని చెప్పారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరో ఒకరు ఆరోపణలు చేసినంత మాత్రాన మంత్రులు అవినీతికి పాల్పడ్డారని అనుకుంటే ఎలా అన్నారు. మోపిదేవిపై ఆరోపణలు చేసిన రమణ బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్, కాబట్టి ఆయన మాటలను చట్టం పరిగణలోకి తీసుకోదన్నారు. రమణ ఇచ్చిన వాంగ్మూలంలో అన్ని పార్టీల నేతల పేర్లు ఉన్నాయన్నారు.
మోపిదేవిపై ఆరోపణలను పలువురు మంత్రులు కూడా ఖండించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం మాఫియాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. మంత్రులు, ఐఏఎస్‌లు చట్టానికి అతీతులు కాదన్నారు. ఆనంను లెక్చరర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే సంవత్సరానికి రూ.3500 కోట్ల ఉపకార వేతనాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలలో రూ.15 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని వ్యక్తి చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి రఘువీరా రెడ్డి వేరుగా మద్యం వ్యాపారి రమణను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోపిదేవిపై ఆరోపణలు నిజం కాదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలన్నారు.

1 కామెంట్:
రమణ బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్, కాబట్టి ఆయన మాటలను చట్టం పరిగణలోకి తీసుకోదన్నారు బొత్స. చాలా పొరబాటు మాట.
చట్టం యెవరి మాటనైనా పరిగణనలోనికి తీసుకుంటుంది - తగిన ఆధారాలు ఉంటే.
బొత్స మాటలు ఆయన అపరిపక్వతకు సూచనా? లేక ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఆయన ఆత్రుతకు సూచనా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి