మీడియాకు సిబిఐ చేసిన విజ్ఞప్తిని గాంధీజీ మూడు కోతుల సామెతకు అన్వయిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించింది. చెవులు, కళ్లు, నోరు మూసుకుని ఉండే గాంధీజీ మూడు కోతుల సామెతను సిబిఐ ప్రకటన గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఇంతకీ అలా వ్యాఖ్యానించడానికి కారణమేమిటంటే - తమ వద్దకు వచ్చే వారి పేర్లను వెల్లడించకూడదని, వారు వచ్చిన విషయంపై రాయవద్దు, ప్రసారం చేయవద్దని సిబిఐ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. తమ వద్దకు వస్తున్న వ్యక్తులు దిల్‌కుషా అతిథి గృహం వద్ద మీడియా వాహనాలు పెద్ద యెత్తున మోహరించి ఉండడంపై ఫిర్యాదు చేస్తున్నారని చెప్పింది.
మీడియా వల్ల నిజాయితీపరులైన సాక్షులు తమ వద్దకు రావడానికి జంకుతున్నారని కూడా చెప్పింది. దానివల్ల విచారణకు విఘాతం ఏర్పడుతుందని చెప్పింది. హైదరాబాద్ సిబిఐ ఎస్పీ హెచ్ వెంకటేష్ పేర ఆ ప్రకటన జారీ అయింది. ఆ ప్రకటనను సిబిఐ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా పంపించింది. అయితే, ఆ ప్రకటన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ పేరు మీద కూడా ఎస్పీ స్థాయి అధికారి వెంకటేష్ ఎందుకు జారీ చేశారని ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐఎఎస్ అధికారుల గగ్గోలుతో సిబిఐ ఎస్పీ వెంకటేష్ ఆ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి