25 మార్చి, 2012

ధనుష్ '3'సినిమా ఆపాలని కుట్ర చేసారు

www.mulakkada.com                                Natti Kumar 

సౌతిండియా ఫిలిం ఛాంబర్ నుంచి అప్రూవల్ పొందినా నా సినిమాని ఆపాలనే కుట్రతో ఇక్కడ నిర్మాతలు కొందరు టైటిల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని నట్టికుమార్ వ్యాఖ్యానించారు. ఆర్.కె.ప్రొడక్షన్స్ పతాకంపై టైటిల్ ముందే రిజిస్టర్ అయి ఉన్నందున ఈ సినిమా రిలీజ్ కు అడ్డంకి సృష్టించారని అన్నారు. ఎట్టకేలకు టైటిల్ వివాదం ముగిసిందని నట్టికుమార్ తెలిపారు. ఆయన చిత్రం ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే అంతర్జాతీయంగా ఖ్యాతినార్ధించిన కొలవెరి పాట 3 చిత్రంలో ఉండటం అదృష్టం. ఆంధ్రప్రదేశ్ లో 700కి పైగా ధియోటర్స్ లో ఈ నెల 30న విడుదల చేస్తున్నా. తెలుగులో ఓ అగ్రహీరో సినిమా కంటే గ్రాండ్ రిలీజ్ ఇది. అలాగే 21 ఏళ్ల అనిరుధ్..ఏ.ఆర్.రహమాన్ ని మించిన సంగీతం ఇచ్చారు. ఈ నెల 29న ప్రీమియర్ షో వేస్తున్నా. చిత్ర యూనిట్ తో సహా ప్రముఖలు వీక్షిస్తారు అని చెప్పుకొచ్చారు. 

కామెంట్‌లు లేవు: