10 మార్చి, 2012

కాలుష్యం లేని ప్రపంచం కోసం 'ఆచార్య సైక్లో‌థాన్'

                                  Acharya Habba 2012
ఆచార్య సంస్దలు ఈ సంవత్సరం వారియొక్క వార్షిక పండుగ 'ఆచార్య హాబ్బ'ని మార్చి 11(ఆదివారం) ఉదయం 6 గంటలకు 'సైక్లోథాన్' పేరుతో ప్రారంభించనున్నారు. ఈ సైక్లోథాన్‌లో ఆచార్య సంస్దల విద్యార్దులు మన దైనందిన జీవితంలో సైక్లింగ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాకుండా సాధ్యమైనంత మంది ఎక్కువ మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గోనేలా ప్రోత్సహిస్తున్నారు.

ఎక్కువ మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గోని వాతవరణ కాలుష్యం స్దాయిలను తగ్గించడమే కాకుండా పర్యావరణం మీద ప్రగతిశీల ప్రభావం కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని ఆచార్యా సాహాస క్లబ్ 'ADVENTURE.INC' పేరు మీద ఆచార్య్ హాబ్బ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్పూర్తినిచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సైక్లింగ్ మీద మక్కువ ఉన్న యువకులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గోని దీనిని విజయవంతం చేయాల్సిందిగా ఆచార్య సంస్దల విద్యార్దులు కోరారు.

ఈ సైక్లోథాన్ మొత్తం పది కిలోమీటర్లు పొడవున సాగుతుంది. కంఠీరవ స్డేడియం దగ్గర ప్రారంభమై మల్లేశ్వరం 18th క్రాస్ గ్రౌండ్స్ వరకు సాగుతుంది. ఈ మద్యలో హడ్సన్ వృత్తం, విధానసౌధ, రాజ్ భవన్, బిడిఎ జంక్షన్, కావేరి థియేటర్ మొదలగున వాటిమీదగా ఈ సైక్లోథాన్ సాగుతుంది. ఇందులో మొత్తం 100 వరకు సైకిల్స్ పాల్గోననున్నాయి. నెలరోజులు పాటు ఆచార్య విద్యాసంస్దలు నిర్వహించే ఆచార్య హాబ్బ ఫెస్టివల్‌లో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఆచార్య హాబ్బ ఫెస్టివల్ మార్చి 15, 16, 17వ తారీఖున ఆచార్య విద్యాసంస్దలలో అంగరంగ వైభవంగా నిర్వహించినున్నారు.

కామెంట్‌లు లేవు: