ఓ శ్రీలంక జాతీయుడికి లిఫ్ట్ ఇచ్చినందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన బండి రాజు అనే 31 ఏళ్ల వ్యక్తి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ జైలులో మగ్గుతున్నాడు. న్యాయ సహాయం కోసం అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజు అఫ్గనిస్తాన్‌లో ఓ కెనడా కంపెనీ కోసం పనిచేస్తున్నాడు. ఎస్కార్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు శ్రీలంక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు. దొంగతనం కేసులో ఆ లంకేయుడిని పోలీసులు వెతుకుతున్నారు. రాజును అరెస్టు చేయడానికి ప్రధాన కారణం అది.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌కు చెందిన రాజు 2010లో అఫ్గానిస్తాన్ వెళ్లాడు. కాందహార్ ఎయిర్‌ఫీల్డ్ కెనడియన్ ఇంజనీర్ సపోర్ట్ స్క్వాడ్రన్‌లో ఎఐఎం గ్రూప్ ఎస్కార్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మిలిటరీ ట్రక్కు దొంగతనం కేసులో పోలీసులు ఆ లంకేయుడి కోసం అన్వేషిస్తుండగా, రాజు కారులో అతను ప్రయాణిస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి రాజు కూడా జైలులోనే ఉన్నాడు. రాజుకు భార్య లావణ్య, తండ్రి అనంతరావు, తల్లి కమల, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి