3 మార్చి, 2012

రోడ్డు ప్రమాదంలో "మా టీవీ" సూపర్ సింగర్ వైష్ణవి మృతి

                                                         
వర్థమాని గాయని, మా టీవీ సూపర్ సింగర్ వైష్ణవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. హోండా యాక్టివాపై మామయ్యతో వెళుతూ హైదరాబాదులోని ప్యారడైజ్ వద్ద బస్టాప్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కోకిల కంఠస్వరం నుంచి కమ్మని రాగాలు పలికే వైష్ణవి స్వస్థలం గుంటూరు. మా టీవీ సూపర్ సింగర్స్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అందరి మన్ననలు పొందింది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనుకుంటే అందని లోకాలకు వెళ్లిపోయింది. మా టీవీలో వైష్ణవి ఆలపించిన ఓ గీతం.. వీడియోలో చూడండి.

కామెంట్‌లు లేవు: