రా.వన్ చిత్రానికి యూనిమేటర్‌గా అద్భుతమైన పనితీరు కనబర్చి జాతీయ అవార్డు సొంతం చేసుకున్న పాతికేళ్ల యువతి చారుఖండాల్ రోడ్డు ప్రమాదానికి గురై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం రాత్రి చారుఖండాల్ తన సోదరి రీతూ, స్నేహితుడు విక్రాంత్ కలిసి జుహు ప్రాంతంలో డిన్నర్‌కు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో చారు ఖండాల్ వెన్నుముఖకు తీవ్రమైన గాయమైంది. సోదరి రీతూ స్వల్ప గాయాలతో తప్పించుకోగా స్నేహితుడు విక్రాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. రా.వన్ హీరో షారుఖ్ ఖాన్ చారు ఖండాల్ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. స్వయంగా వెళ్లి ఆమెను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి