రామ్ చరణ్, ఉపాసన పెళ్లి ఫిక్సయిన కొత్తలో ఓ వార్త అప్పట్లో సంచలన సృష్టించింది. రాయల్ ఫ్యామిలీకి చెందిన ఉపాసన
కుటుంబ సభ్యులు తమకు కాబోయే అల్లుడు రామ్ చరణ్ తేజకు రూ. 150 కోట్ల విలువ
చేసే చార్టెడ్ ప్లైట్ కట్నంగా ఇవ్వబోతున్నారని వార్తలు వినిపించిన సంగతి
తెలిసిందే. పలు మీడియా ఛానళ్లు కూడా అప్పట్లో ఈ వార్తను ఫోకస్ చేశాయి.
అయితే అలాంటిదేమీ లేదని ఇరు కుటుంబాల వారు స్పష్టం చేశారు.
అయితే
తాజాగా ఈ చార్టెడ్ ప్లైట్ విషయం తెరపైకి వచ్చింది. చెర్రీకి అత్తారింటి
నుంచి ఆ గిఫ్టు ఎప్పుడో అందిందని, అయితే ఆ విషయం బయటకు తెలియకుండా రహస్యంగా
ఉంచుతున్నారనే ఓ బేస్ లెస్ రూమర్ ప్రచారం జరుగుతోంది. అంతే కాదు దాన్ని
పవన్ కళ్యాణ్ వాడుతున్నాడని, గబ్బర్ సింగ్ ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్
దాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వాడారని కూడా అంటున్నారు.
రూ. 150 కోట్ల
విలువ చేసే విమానం లాంటి వస్తువు కొన్నప్పుడు బయటకు తెలియకుండా ఎలా
ఉంటుంది? ఇదంతా ఓ పుక్కిటి పుకారని, ఆధారం లేని అసత్య ప్రచారమని స్పష్టం
అవుతోంది కదూ..! సినిమా వాళ్లపై ఇలాంటి వార్తలు సహజమే. అయితే ఇదంతా ఓ అసత్య
ప్రచారమే అని చెప్పడానికే ఈ పుకారును టచ్ చేశాం.
ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మరో మూడు నాలుగు రోజుల్లో
చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగులో బిజీగా
కాబోనున్నాడు. ఇక పవర్ స్టార్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
రూపొందుతోన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగులో
పాల్గొంటున్నాడు. జూన్ 15నే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి