బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న దబాంగ్ 2 సినిమా షూటింగులో అగ్ని
ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నుంచి సల్మాన్ తృటిలో తప్పించుకున్నాడు.
ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
ప్రాథమిక
చికిత్స నిమిత్తం గాయపడినవారిలో ఒకతన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా తన బైక్‌పై
సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.
దబాంగ్ 2 సినిమాకు సల్మాన్ ఖాన్ సోదరుడు దర్శకత్వం వహిస్తున్నాడు. దబాంగ్
సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టడంతో దబాంగ్ 2కు శ్రీకారం చుట్టారు.
దబాంగ్ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది.
దబాంగ్
సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ పేర నిర్మితమై
విడుదలైంది. గబ్బర్ సింగ్ కూడా తెలుగులో మంచి సక్సెస్‌ను సాధించింది.
సల్మాన్ ఖాన్ నటించిన దబాంబ్ 2 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి