రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రంలో ఇలియానా ఓ డిఫెరెంట్ పాత్రలో కనపించనుంది.
అది టాక్సీ డ్రైవర్ పాత్ర అని తెలుస్తోంది. బ్యాంకాక్ లో ఈ పాత్ర
ఉంటుందని,అక్కడికి ఇండియాలో ఉండే రవితేజ ఓ పని నిమిత్తం వెళ్లి ప్రేమలో
పడతాడని,అక్కడ నుంచి కథ మలుపులు తిరగనుందని సమాచారం.
ఇక ఈ చిత్రం
ఆడియో 22 వ తేదీ శిల్పకళా వేదికలో భారీగా విడుదల అవుతోంది. ఈ ఆడియోలో టీవి
నైన్ లో పాపులర్ అయిన 'యేమి సేతురా లింగా...' అనే ట్యూన్ తో ఉండే పాట
హైలెట్ కాబోతోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్
సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్
భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న దేముడు చేసిన
మనుష్యులు రిలీజ్ కు రెడీగా ఉంది.
దర్శకుడు పూరి జగన్నాధ్
మాట్లాడుతూ...దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి అనే కార్డ్
వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది.
నాకు రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు.
దేవుడున్నాడా?
లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా
ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన
మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున
గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు.
హీరో రవితేజ మాట్లాడుతూ...పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇది ఐదవ చిత్రం. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు వింటూంటే ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా అని ఎంతో ఎక్సైట్ అయ్యాను. జగన్ కాంబినేషన్ లో మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నారు.
హీరో రవితేజ మాట్లాడుతూ...పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇది ఐదవ చిత్రం. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు వింటూంటే ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా అని ఎంతో ఎక్సైట్ అయ్యాను. జగన్ కాంబినేషన్ లో మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నారు.
నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్
మాట్లాడుతూ..ఇడియట్ వంటి చాలా పెద్ద రేంజి సినిమా అవుతుంది. రవితేజ సరసన
ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,
అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు
నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే,
పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్
ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి