బికినీలో ఉన్న ఆ పాప అందాలు చూసారుగా! తన అందాలతోనే యూత్‌కి కిక్కెక్కించే
రకం. పేరు గాబ్రియేలా బెర్టాంటె. ఒక్కసారి ఆమె వైపు లుక్కేసి పేరు పలకడం
కష్టమే. గాబెబెబె అంటూ తికమక పడిపోతుంటారు చాలా మంది! ఆ రేంజిలో
పిటపిటలాడుతోందీ బ్యూటీ. ఈ వయ్యారిది మనదేశం కాదు. బ్రెజిల్ నుంచి
దిగుమతైంది. ఈ భామ తాజాగా పవన్-పూరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘కెమెరామెన్
గంగతో రాంబాబు' చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుంది.
పూరి-రవితేజ కాంబినేషన్లో మొన్నటి వరకు షూటింగ్ జరుపుకున్న ‘దేవుడు
చేసిన మనుషులు' చిత్రంలో ఈ అమ్మడు ఐటం గర్ల్‌గా ఎంపికయింది. తాజాగా
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలోకి కూడా ఈ పాపను తీసుకున్నాడు పూరి.
పూరి చిత్రంలో ఐటం సాంగులో ఏ రేంజిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదే.
ఐటం
సాంగుల విషయంలో యూత్‌కు కిక్కెక్కించే శృంగార మషాలా బాగా
దట్టించి....వారికి మత్తెక్కించడంలో పూరిని మించినోడు టాలీవుడ్లో లేరంటే
అతిశయోక్తి కాదేమో. పోకిరిలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే', బిజినెస్
మేన్ చిత్రంలో ‘విలవ్ బ్యాడ్ బాయ్స్'..ఇలా చెప్పుకుంటూ పోతే పూరి ప్రతి
సినిమా ఐటం సాంగు మత్తెక్కించే రేంజిలోనే ఉంటుంది.
"First day
shooting for my next movie @purijagan ..thank u for everything purii!!"
అంటూ గాబ్రియేలా నిన్న(జూన్ 18)న ట్విట్టర్లో ట్వీటింది. ఈ నెల జూన్ 15న
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దీన్ని బట్టి ఆమె
పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తోందని స్పష్టం అవుతోంది.
కెమెరామెన్
గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన తమన్నా లీడ్ హీరోయిన్‌గా
నటిస్తోంది. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈచిత్రాన్ని
నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి