పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఆసుపత్రిలో ప్రత్యక్ష్య అయ్యారు. ఎల్.బి.నగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ‘గబ్బ్ సింగ్' నిర్మాత బండ్ల గణేష్‌ను పరామర్శించారు. గురువారం రాత్రి చరణ్ రిసెప్షన్ నుంచి పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆసుపత్రికి వచ్చి నిర్మాతను పరామర్శించడం ఇదే తొలిసారి. పవన్-గణేష్ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఇదో నిదర్శనం అని చెప్పొచ్చు. ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గణేష్ శనివారం ఆసుపత్రి నుంచి డిచ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.
గణేష్ ఆ సుపత్రిలో చేరడానిని కారణం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సాగర్ హైవే వద్ద గణేష్ కి స్థానికులు దేహశుద్ధి చేయడమే. ఆగపల్లి హైవేపై బండ్ల గణేష్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయలయ్యాయి.
ఇది గమనించి ఆగ్రహించిన బాధితుని బంధువులు, స్థానికులు గణేష్‌పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన గణేష్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కారు ఢి కొనడంతో గాయపడ్డ వ్యక్తిని కూడా సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి