బెంగళూరు: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు
ఎదుర్కొంటున్న బెంగళూరులోని ప్రెంచ్ కాన్సులేట్ అధికారిని కర్నాటక పోలీసులు
మంగళవారం అరెస్టు చేశారు. హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించడంతో
ఫ్రెంచ్ కాన్సులేట్ అధికారు పాస్కల్ మజూరియర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు
చేశారు. పాస్కల్ తన కన్న కూతురు పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ అతని
భార్య సుజా జాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు
స్వీకరించిన పోలీసులు అతనిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి
పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రెంచ్ అధికారి భారత్‌లో పని
చేస్తున్నందున భారతీయ చట్టాల ప్రకారమే విచారణ కొనసాగుతుందని ఫ్రెంచి దౌత్య
వర్గాలు పేర్కొన్నాయి.
ఉదయం అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతనిని
మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. 39 ఏళ్ల పాస్కల్ బెంగళూరులోని
ఫ్రెంచ్ కాన్సులేట్‌లో డిప్యూటీ హెడ్‌గా పని చేస్తున్నాడు. ఇతనిపై పోలీసులు
376 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని
పాస్కల్ పైన ఆరోపణలు వచ్చాయని, దీనిపై కేసు నమోదయిందని, తాము పోలీసులకు
పూర్తిగా సహకరిస్తామని ఫ్రెంచ్ కాన్సులేట్ అధికారులు చెప్పారు. కాగా
సోమవారం బాలల హక్కుల సంఘం వాళ్లు కాన్సులేట్ ముందు ఆందోళన చేశారు.
పాస్కల్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
1 కామెంట్:
ఇదన్యాయం, వాణ్ణి ఆంధ్రాలో ఎన్నికల్లో నిలబెట్టండి. లోక్‌సభకు ఎన్నుకుందాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి