ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై గతంలో ‘గౌతమ బుద్ధ', మైహార్ట్ ఈజ్ బీటింగ్
చిత్రాలు నిర్మించి, నంది అవార్డుని పొందించిన అభిరుచి కలిగిన నిర్మాత రాజ్
కుందుకూరి తొలిసారిగా స్వీయదర్శకత్వంలో ఒక పూర్తి వినోదాత్మక చిత్రం
నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల భీమునిపట్నంలోని
మహాలక్ష్మి టెంపుల్‌లో సద్దురు శివానంద మూర్తి చేతులమీదుగా జరిగింది.
తొలి షాట్‌కి శివానందమూర్తి క్లాప్ ఇవ్వగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి
కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత, నటుడు, ఫిలించాంబర్ ప్రధాన
కార్యదర్శి కొల్లా అశోక్ కుమార్ తొలిషాట్‌కి దర్శకత్వం వహించారు. దర్శకుడు
ఈచిత్రం వివరాలను తెలియజేస్తూ...ఇది పూర్తి హాస్య ప్రధాన చిత్రమని, రెండు
గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బానవ్వించే కథ, కథనంతో ఈ చిత్రాన్ని
రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్న
జోశ్యభట్ల చక్కటి ట్యూన్స్ అందించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింగిల్
షెడ్యూల్ పూర్తి చేసి డిసెంబరులో విడుదల చెయ్యాలనుకుంటున్నట్లు
చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న ‘ఈ రోజుల్లో' ఫేం శ్రీ
మాట్లాడుతూ.... ఈ చిత్రం నా కెరీర్‌లోనే మరో మంచి చిత్రం అవుతుంది.
‘ఈరోజుల్లో' చిత్రాన్ని మించి ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో
ఉన్నానని అన్నారు. ఈ చిత్రం హీరోయిన్‌గా తషుకౌషిక్ నటిస్తుండగా మిగిలిన
ప్రధాన పాత్రల్లో కోట శ్రీనివాసరావు, పృథ్వి, జీవా, సుమన్ శెట్టి, అదుర్స్
రఘు, రాజ్ కందుకూరి నటిస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికైన తషు
కౌషిక్ బాగా లావెక్కి ఆంటీలా కనిపిస్తూ హీరో శ్రీకి జోడీ కుదరలేదనే
విమర్శలు వినిపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి