పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్ సింగ్'హిస్టారికల్ మాస్ హిట్‌గా
నిలిచిన సంగతి తెలిసిందే. రేపటికి (జూన్ 29, శుక్రవారం)నాటికి యాభై రోజులు
పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎక్కువ సెంటర్లు లలో ఉండటం కూడా ఓ రికార్డు ని
నమోదు చేయబోతోంది. మగధీర చిత్రం రికార్డుని ఈ చిత్రం బ్రద్దలు కొట్టనుంది.
ఎగ్డిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రంతో చాలా ఖుషీగా ఉన్నట్లు
చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ఓ జెన్యూన్ హిట్ గా తెలుగు పరిశ్రమ ఈ
చిత్రాన్ని పరిగణిస్తోంది.
అయితే రేపు శుక్రవారం ఎన్ని థియేటర్స్ లో ఈ చిత్రం నిలబడి ఉంటుంది అనేదానిపై ఈ రికార్డు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండటంతో ధియోటర్స్ తగ్గిస్తూంటారు. మగధీర చిత్రం 2009 లో విడుదలై యాభై రోజుల రికార్డుని 272 లో నిలబడి క్రియేట్ చేసింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఆ రికార్డుని బ్రద్దలు కొట్టి కొత్త రికార్డుని క్రియోట్ చేస్తుందని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ బాబు
మాట్లాడుతూ...పవన్‌కల్యాణ్ 'గబ్బర్‌సింగ్' రాకతో మునుపటి రికార్డులన్నీ
ఎగిరిపోయాయి. మా సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా మా
హీరో అలాంటివేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటున్నారు. ఆయన వీటిని
పట్టించుకోర ని అన్నారు. త్వరలో ఈ సినిమా విజయోత్సవాన్ని భారీ ఎత్తున
చేయబోతున్నాం. ఆ సందర్భంగా ఈ సినిమాని పైరసీ నుంచి కాపాడిన అభిమానులకు
సన్మానం చేస్తాం అని చెప్పారు.
హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర
ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఘన
విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల
తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన నాటి
నుంచి పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు
పరిశ్రమలోని పాత రికార్డులను తన కలెక్షన్స్ తో చెరిపేసి కొత్త రికార్డులను
క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి