అప్పట్లో మోహన్ బాబు హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అసెంబ్లీ రౌడీ'
చిత్రం రీమేక్ ద్వారా మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు రావడానికి ట్రై
చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా
అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విష్ణు పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంటుందని, ప్రస్తుతం రాజకీయాల
ప్రస్తావిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.
విష్ణు జగన్ నేపథ్యాన్ని
ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణ ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం
స్టేట్‌లో మంచి జోరు మీదన ఉన్న నాయకుడు జగన్. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఢీ
కొంటూ ఓ వైపు సక్సెస్ ఫుల్‌గా పార్టీ నడిపిస్తూ...మరో వైపు అక్రమ ఆస్తుల
కేసులో జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. జగన్ జైల్లో ఉన్నప్పటికీ ప్రజల
ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తరగలేదు.
ఈ నేపథ్యంలో జగన్ అంశాన్ని తన
సినిమాలో ఫోకస్ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెరుగుతాయని, ప్లాపుల బాటలో
ఉన్న తనకు హిట్ దక్కే అవకాశం ఉందని, జగన్‌ను అభిమానుస్తున్న వాళ్లంతా వచ్చి
సినిమా చూసినా సినిమా హిట్టయిపోతుందనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే ఈ
చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక హీరోయిన్ గా
తాప్సీ ని ఎంపిక చేయనున్నారని సమాచారం.
ఆ మధ్య వరుస ప్లాపుల తర్వాత
చాలా గ్యాప్ తీసుకున్న విష్ణు త్వరలో ‘దేనికైనా రెడీ' చిత్రం ద్వారా
ప్రక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి
దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్గా ఎంపికైంది. ఈ
చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ
నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్
కామెడీ ఎంటర్టైనర్గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.
1 కామెంట్:
All the best
కామెంట్‌ను పోస్ట్ చేయండి