ఈ పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తినే తిండి దగ్గర్నుంచి
మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి చేయాల్సిన వర్కవుట్లన్నీ చేశాను. నాలో
మార్పు వచ్చిందని కొంతమంది చెబుతుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నటిగా కూడా
నాకు మంచి సంతృప్తినిచ్చింది అంటోంది శ్రీదేవి.
లాంగ్ గ్యాప్ తర్వతా
అతిలోక సుందరి శ్రీదేవి చేస్తున్న చిత్రం ‘ఇంగ్లీష్ -వింగ్లీష్'.
హిందీలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘చీనీకమ్', ‘పా' చిత్రాలు తీసిన
ఆర్.బాలకృష్ణన్ సతీమణి గౌరీ షిండె దర్శకత్వం వహించారు. ‘ఇంగ్లీష్
-వింగ్లీష్' చిత్రానికి కథ, కథనాన్ని ఆమే సమకూర్చుకుంది. చిత్రీకరణ అంతా
న్యూయార్క్‌లో జరిగింది. ఇప్పటికే విడుదలైన పస్ట్ లుక్ పోస్టర్స్ ,
ట్రైలర్స్ అంతటా చర్చనీయాంశంగా మారాయి.
చిత్రంలో శ్రీదేవి పాత్ర గురించి
దర్శకురాలు గౌరీ షిండె మాట్లాడుతూ..మొదట్లో ఆ పాత్రకు శ్రీదేవి గురించి
నేను ఆలోచించలేదు. ఒకరోజు మావారు ఏదో పనిమీద శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను
కలుసుకోడానికి వాళ్లింటికి వెళ్లారు. మాటల సందర్భంలో ఆయనతో నా స్క్రిప్టు
గురించి చెప్పారు. మరుసటి రోజే శ్రీదేవికి స్క్రిప్టు వినిపించాను. అలా ఆమె
నా చిత్రంలో హీరోయిన్ అయింది. చాలాకాలంగా ఆమె చిత్రరంగానికి దూరంగా ఉన్నా ఈ
పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది.
శ్రీదేవి మాట్లాడుతూ..మళ్లీ
ఎంట్రీ అంటూ ఇస్తే గౌరవప్రదమైన పాత్రతోనే ఇవ్వాలని ఎన్నో కథలు విన్నాను.
చివరకు గౌరీ షిండే చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.
అమెరికాలో స్థిరపడిన చదువురాని యువతి కథ ఇది. ఇద్దరు పిల్లల తల్లి
విదేశానికి వెళ్లి అక్కడ ఇంగ్లీషు మాట్లాడడం తెలియకపోవడం వల్ల ఎదుర్కొన్న
ఇబ్బందులు ఎంత తమాషాగా ఉంటాయన్నదీ ఆ చిత్ర కథాంశం. ‘ఇంగ్లీష్-వింగ్లీష్'
ద్వారా ఓ కొత్త శ్రీదేవిని చూస్తారు. త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు
సన్నాహాలు చేస్తున్నారు అని తెలిపారు.
ఇంగీషు చదవడానికి తెగ ఇబ్బందిపడిపోతూ... చివరకు ఎట్టకేలకు చదివేసి ప్రపంచాన్ని జయించిన దానిలా శ్రీదేవి ఇస్తున్న హావభావాలు నాటి ఆమె అభిమానులనే కాక, నేటి యువతరాన్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి