తెలుగు సినిమా హీరోల మధ్య రికార్డుల వార్ చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ జనరేషన్ నుంచి పోకడ శృతి మించి ఇప్పుడు తారా స్థాయికి చేరంది. సినిమా రికార్డులందు ఫేక్ రికార్డులు వేరయా అన్నట్లు పరిశ్రమలో తమ సినిమాను నడిపించుకోవడానికి చాలా మంది ఫేక్ రికార్డులు సృష్టించడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తూనే ఉంది.
ఇదే విషయమై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాట్లాడుతూ...పరిశ్రమలో ఫేక్ రికార్డులు సృష్టిస్తున్న మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కొన్ని సినిమాల కలెక్షన్లు మాత్రమే నిజాయితీగా, ట్రాన్ఫరెంట్‌గా ఉంటున్నాయని....మిగతావన్నీ ఫేక్ రికార్డులే అని తేల్చేశారు. ఒక స్టార్ హీరో సినిమాను సరైన సమయంలో విడుదల చేస్తే రూ. 40 కోట్లు వస్తాయనే అంచనాలుంటాయి. సినిమా సరిగా ఆడక పోతే నష్టాలు తప్పవు. లాభాలు వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి అని చెప్పుకొచ్చారు.
ఆనలుగురు...పరిశ్రమను శాసిస్తున్నారు, చిన్న సినిమాలను, నిర్మాతలను తొక్కేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటని? అని అడగ్గా...దిల్ రాజు సమాధానం ఇస్తూ.....నేను ఈ వాదనతో ఏకీభవించను. నాకు పెద్ద బ్యాంగ్రౌండ్ లేదు, ఇతరుల్లా ఫిల్మ్ స్టూడియోలు కూడా లేవు. ప్రస్తుతం నాకు 25 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. నా సినిమాలు విడుదల చేసుకునే సమయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నాను' అని చెప్పుకొచ్చారు.
దిల్ రాజు ప్రస్తుతం మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్‌గా చేస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి