ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఈగ' చిత్రం జులై 6న విడుదలకు సిద్దం అవుతోంది.
అప్పుడెప్పుడో విడుదల చేస్తానని చెప్పిన వాయిదాల మీద వాయిదాలు వేస్తూ
ప్రేక్షకులకు చికాకు తెప్పించిన రాజమౌళి చిత్రం ఆలస్యానికి కారణం ఏమిటో
ప్రతి రోజు ప్రోగ్రెస్ రిపోర్టు ప్రేక్షకులు వివరిస్తూ....ఇంకా ఇన్ని
గ్రాఫిక్ షాట్స్ పూర్తి కావాల్సి ఉందంటూ నచ్చ చెబుతూ ప్రేక్షకుల్లో ఈగ
చిత్రంపై మళ్లీ ఆసక్తి పెంచేలా అష్ట కష్టాలు పడుతున్నారు.
ఈగ చిత్రం స్టోరీ ఇప్పటికే స్వయంగా లీక్ చేసిన రాజమౌళి ఇప్పుడు
అంతర్మథనంలో పడ్డట్లు ఆయన తపన బట్టి స్పష్టం అవుతోంది. సినిమా స్టోరీ
చెప్పడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. కేవలం
గ్రాఫిక్స్ చూడ్డం కోసమే వెళ్లాలా? అనే అనే ఆలోచనలో ఉన్నారు చాలా మంది.
అయితే రాజమౌళి మాత్రం తన టేకింగ్, గ్రాఫిక్స్‌పై చాలా నమ్మకం
పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ
లేని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్ రాజమౌళి ప్రేక్షకులకు
చూపించబోతున్నారనేది మాత్రం నిజం. ఇందు కోసం ఆయన చాలా కష్టపడుతున్నారనేది
ప్రోగ్రెస్ రిపోర్టు చూస్తే స్పష్టం అవుతోంది. అన్నట్లు ఈచిత్రంలో ‘ఈగ'కు
డబ్బింగ్ రాజమౌళి స్వయంగా చెబుతున్నారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన
పాత్రల్లో ఈచిత్రం రూపొందుతోంది. కీరవాణి సంగీతం అందించిన ఈచిత్రాన్ని సాయి
కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటి
ఇండియాలో నిర్మితమైన అద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రాల్లో ‘ఈగ' కూడా చోటు
దక్కించుకోనుంది. ఇందుకోసం కోట్ల రూపాయల ఖర్చుతో అందుకు సంబంధించి
ఎఫెక్ట్స్ చేయిస్తున్నారు. సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకమైన కెమెరాలు
వాడారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి