ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో
రూపొందుతోన్న చిత్రం ‘రెబెల్'. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్
చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాస్ అండ్
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లారెన్స్ ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా
అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకుని
ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
‘రెబెల్'
చిత్రం విడుదలకు ముందు నుంచే సంచనాలు రేకిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభాస్
కెరీర్లోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో రూ. 5.75 కోట్లకు ఈచిత్రం
శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెబల్‌గా ముద్రపడ్డ ఓ
యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుంది? అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి
కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు
పరుగెడుతుంది అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని రూపొందించారు.
ఈ భారీ
బడ్జెట్ చిత్రాన్ని జె. భగవాన్ మరియు జె. పుల్లారావులు సంయుక్తంగా
నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభమైన కొన్ని రోజులకి ఈ చిత్రం నుండి
మొదట అనుకున్న హీరోయిన్ అనుష్క మరియు సంగీత దర్శకుడు తమన్ తప్పుకోవడం వల్ల ఈ
చిత్రం చిత్రీకరణ అనుకున్న దాని కంటే కొంత ఎక్కువ సమయం తీసుకుంది.
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటే ఈ చిత్రానికి
సంగీతం కూడా అందిస్తున్నారు.
ప్రభాస్
ఈచిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా
నటిస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఈచిత్రానికి తొలుత ‘వారధి'
అనే టైటిల్ పేరు వినిపించినా... 'రుద్ర'గా మార్చటానికి సన్నాహాలు
చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అనూష్కతో పాటు మరో హీరోయిన్ గా రిచా
గంగోపాధ్యాయ నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని
నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్ నిర్మాతలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి