అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఇష్క్
సినిమాతో యువ హృదయాలలో సెటిలైంది. ఆమె పోస్టర్ మీద కనపడితే చాలా ధియోటర్స్
జనంతో నిండుతున్నాయి..శాటిలైట్ మార్కెట్ వస్తోంది. దాంతో ఆమె గెస్ట్ గా
కనిపించినా ఆ క్రేజే వేరు అంటున్నారు. అందుకేనేమో సిద్దార్ద,సమంత
కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను గెస్ట్ గా తీసుకున్నారు.
నిత్యామీనన్
గెస్ట్ గా తొలిసారి చేస్తున్న ఈ చిత్రలో ఆమె పాత్ర ఉండేది కొద్ది సేపైనా
మంచి సీన్స్ ఉన్నాయంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం
తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై
బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని
తెలుస్తోంది.
ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేశ్ తెలియజేస్తూ
"నందినీరెడ్డి అద్భుతమైన కథ చెప్పారు. సిద్ధార్థ్, సమంత కూడా కథ వినగానే
ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. ఇటీవల 'కాంచన', 'కందిరీగ' వంటి చిత్రాలు మా
బేనర్‌కి ఎంతో పేరు తెచ్చాయి. ఈ సినిమా ఆ కోవలోనే పెద్ద హిట్టవుతుంది'' అని
చెప్పారు.
నందినీరెడ్డి మాట్లాడుతూ - నాని, నిత్యాల జంటలాగే, సమంత,
సిద్దార్ధ్ జంట అనగానే 70% విజయం వచ్చినట్లేననీ, అందరికీ నచ్చే విధంగా ఈ
చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్,
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, ఎడిటింగ్: కోటగిరి
వెంకటేశ్వరరావు, సంగీతం: తమన్ ఎస్.ఎస్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్,
బెల్లంకొండ గణేష్‌బాబు, కథ, దర్శకత్వం: బి.వి.నందినీరెడ్డి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి