హైదరాబాదు శివారులో ఓ రేవ్ పార్టీ తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాదు
శివారులోని హయత్‌నగర్ మండలం పిప్లీపురంలో గల సాయి స్వగృహ రిసార్ట్స్‌లో
యువతీయువకులు నగ్ననృత్యాలతో అశ్లీల కార్యకలాపాలతో ఊగిపోయారు. ఆ
రిస్టార్స్‌పై హయత్‌నగర్ పోలీసులు శనివారం తెల్లవారు జామున మూడు గంటల
ప్రాంతంలో దాడి చేశారు. దాంతో ఆ జల్సా బ్యాచ్ పోలీసుల చేతికి చిక్కింది.
పోలీసులు
25 మంది అమ్మాయిలను, 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో
ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో 40 మంది గోడ దూకి
పారిపోయినట్లు సమాచారం. పవర్ జల్ వంటి మత్తు పదార్థాలు కూడా రిసార్ట్స్‌లో
పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన కాల్ గర్ల్స్‌ను
రప్పించినట్లు తెలుస్తోంది. అయితే, తామంతా ఆర్కెస్ట్రా ట్రూప్ అని
బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం
ప్రమోషన్‌లో భాగంగా పార్టీ పెట్టారని, ఇందుకు ఆర్కెస్ట్రా ట్రూప్‌ను
పిలిపించారని చెబుతున్నారు. కానీ, అందులో నిజం లేదని పోలీసులు అంటున్నారు.
పట్టుబడినవారిలో కొంత మంది సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్లు
తెలుస్తోంది. ఓ విదేశీయుడు కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. మద్యం, మత్తు
పదార్థాలు సేవిస్తూ నగ్న నృత్యాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు
పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి