10 జూన్, 2012
రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగమనడం వట్టి మాటే..!
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే ఎంతో మేలన్నది తప్పుడు ప్రచారమని ఆస్ట్రేలియాలోని లా ట్రోట్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకారుడు స్పెరో ట్సిండోస్ చెబుతున్నారు. నీళ్లు తాగొద్దని తాను చెప్పడంలేదు కానీ ప్రతీరోజూ రెండు లీటర్ల నీళ్లు తాగడం మంచిదన్న విషయం మాత్రం కట్టుకథేనని స్పెరో చెప్పారు.
అలాగే కాఫీలు, టీలు తాగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారన్నదీ కూడా తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చనేది వట్టి పురాణమేనని, దీన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని స్పెరో చెబుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి