22 జూన్, 2012

కొత్త ట్విస్ట్: 'ఈగ' కు రాజమౌళి డబ్బింగ్





















ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తాజా చిత్రం ఈగకు క్రేజ్ తెచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఆయన తాజాగా ఈ చిత్రంలో ప్రధానపాత్ర ఈగ పాత్రకి డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. అయితే ఈగ తెరపై మాట్లాడేది ఏముంటుంది అంటే..అది మనస్సులో మాట్లాడుకునే మాటలు అని తెలుస్తోంది. ఇక నిజానికి నాని పాత్ర చనిపోయి ఈగగా పునర్జమ్మ ఎత్తుతుంది. అయితే పునర్జమ్మ ఎత్తినప్పుడు రూపం మారుతుంది కదా.. అలాగే గొంతు కూడా మారుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'జూలై ఆరవ తేదీన ప్రపంచమంతటా 1200 ప్రింట్లతో విడుదల అవుతోంది. అలాగే ఈ చిత్రాన్ని తమిళ,తెలుగు,మళయాళ,హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి ఆయన మీడియా తో మాట్లాడుతూ... చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే అన్నారు.

అలాగే "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అని అన్నారు.'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.

ఇక ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా వస్తున్నాయని వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చుపెట్టారని విశ్వసనీయ సమాచారం. మొత్తం బడ్జెట్ ముప్పై రెండు కోట్ల వరకూ అయిందని చెప్తున్నారు. తెలుగులో గ్రాఫిక్స్ పై ఇంత ఖర్చు ఎవరూ పెట్టలేదని చూసేవారికి విజువల్ ట్రీట్ లా ఉండాలని రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నాడని చెప్తున్నారు. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌ బాబు.

కామెంట్‌లు లేవు: