వివాదాల పుట్ట నిత్యానంద ఓవరాక్షన్‌పై కర్ణాటక సర్కారు సీరియస్ అయింది. గురువారం నాటి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.... నిత్యానందతో పాటు 8 మంది అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టారు. మరోవైపు.. మొన్న మీడియాపై దౌర్జన్యం చేసిన సాములోరు.. కేసు పెట్టే సరికి పత్తా లేకుండా పోయారు.బెంగళూరులోని బిడది ఆశ్రమంలో... నిత్యానంద అనుచరులు మీడియా సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటనపై కర్ణాటక సర్కారు సీరియస్ అయింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం సదానంద గౌడ... శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.
అటు ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బిడది ఆశ్రమం చుట్టూ 144 సెక్షన్ విధించారు. నిత్యానందతో పాటు దాడికి పాల్పడ్డ 8 మంది అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో 8 మంది అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.మరోవైపు... ఘటనపై విచారణ జరిపేందుకు.. కలెక్టర్, ఎస్పీ.. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడే 3 గంటల పాటు ఉండి.. నిత్యానంద కోసం గాలించారు. అయితే అతను పరారీలో ఉన్నట్లు గుర్తించి వెనుదిరిగారు. మీడియాపై దాడికి దిగిన అతణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి