జూన్ 14: ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు ఆడే ఆట సాకర్. ఆ సాకర్ తర్వాత అత్యంత ప్రజాదరణ చూరగొన్ని ఆట యూరో కప్. ఎవరైత్ అభిమానులు సాకర్ అమితంగా ప్రేమిస్తారో వారికి ఇప్పుడు యూరో కప్ ఫీవర్ పట్టుకుంది. 8 వేదికలు, 31 మ్యాచ్‌లు, 16 జట్లు. సాకర్ అభిమానులు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అనుకుంటున్న యూరో కప్ 2012 వచ్చేసింది. జూన్ 8(శుక్రవారం) నుండి జులై 1వ వరకు జరగనున్న ఈ యూరో 2012 కప్‌కు పోలెండ్, ఉక్రెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
యూరో 2012లో పాల్గోనోనున్న 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, మొత్తం 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మొదటి మ్యాచ్ రాత్రి 9.30గంటలకు, రెండవ మ్యాచ్ 12.15 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రతి గ్రూప్ నుండి టాప్ - 2 జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఎక్కడో యూరప్ దేశాలైన పోలెండ్, ఉక్రెయిన్‌లలో జరుగుతున ఈ పుట్ బాల్ మ్యాచ్‌ల ఫీవర్ బెంగాల్‌లోని అలీపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు పట్టుకుంది. దీంతో జైలు అధికారులను ఖైదీలు పదే పదే వేడుకోనగా వారి కోసం ఈ పుట్ బాల్ మ్యాచ్‌లను టివి సెట్స్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. ఇక వివరాల్లోకి వెళితే...
కోల్‌కత్తా అలీపూర్ సెంట్రల్ జైలు ఇన్‌స్పెక్టర్ రన్ వీర్ కుమార్ వార్తా సంస్ద ఐఎఎన్ఎస్ తో మాట్లాడుతూ మాకు రాష్ట్రంలో ఉన్న ఖైదీలకు నుండి అభ్యర్థనలు రావడం.. ఖైదీలు కూడా తాము ‘యూరో' మ్యాచ్‌లు చూడాలని పట్టుబడడంతో.. గతంలో తొలగించిన కేబుల్ కనెక్షన్‌ను పునరుద్ధరించి మరీ యూరో కోసం ఏర్పాట్లు చేశారు. టోర్నీ ముగిసే వరకు ఖైదీలకు మ్యాచ్‌లను చూసే అవకాశం కల్పించామన్నారు. ఖైదీలు కూడా ఈ మ్యాచ్‌లపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని చెప్పారు.
ఇలాంటి టోర్నమెంట్స్ వీక్షించడం వల్ల ఖైదీలలో ఒకింత ఆత్మ స్దైర్యాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. నివేదికల ప్రకారం ఖైదీలు వారికి నచ్చిన ఐకానిక్ ఆటగాళ్లపై జోరుగా బెట్టింగ్‌లు కూడా పెడుతున్నారని సమాచారం.
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 9.30 గంటలకు డెన్మార్క్ వర్సెస్ పోర్చుగల్
రాత్రి 12.15 గంటలకు నుంచి నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి