ఓ ప్రక్క రామ్ చరణ్ తాను వాటికన్ సిటీలో తన భార్య ఉపాసనతో పాటు ఉన్నానని
ట్విట్టర్ లో రాసి అందరినీ కన్ఫూజ్ చేసి పారేసారు. అందరూ ఇది హానీమూన్
ట్రిప్పా.. ఆధ్మాత్మిక ట్రిప్పా అని సందేహాలు వెళ్లబుచ్చారు. ఈ నేపధ్యంలో
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో
కలిసి సింగపూర్ ట్రిప్ కి వెళ్లి ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.
తాను పస్ట్ మ్యారేజ్ ఏనవర్శరీ జరుపుకుంటున్నట్లు తెలియచేసారు.
దాంతో ఇది అల్లు అర్జున్ కి సెకండ్ హానీమూన్ అని అతని సన్నిహితులు సరదాకా వ్యాఖ్యానిస్తున్నారు. అటు రామ్ చరణ్
ఇటు అల్లు అర్జున్ తమ తమ భార్యలతో టూర్ లలో బిజీగా ఉన్నారు. అందులోనూ
బన్నీ తన జులాయి చిత్రం విడుదలకు సిద్దమైన నేపధ్యంలో చాలా ఉత్సాహంగా
ఉన్నాడు. త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జులాయిని ముస్తాబు చేస్తూ
బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్
శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఆడియో విడుదలై
ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు
ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇప్పటివరకూ చేయని ఓ డిఫెరెంట్ పాత్రను చేస్తున్నారు. అడ్డదారిలో వెళ్లి ఎదగాలనుకునే వ్యక్తి కధ అని తెలుస్తోంది.
కథ ప్రకారం... నాన్నకున్న బాకీలు, చెల్లాయికి కట్టిన రాఖీలు, ఒంటికున్న టీకాలు... ఇది కాదు చరిత్ర అని నమ్మే అల్లరి కుర్రాడతను. మాటలే కాదు, పద్ధతీ కాస్త తికమకగానే ఉంటుంది. జీవితంలో స్థిరపడిపోవాలంటే చాలా కష్టపడాలి. అదే... కాస్త అడ్డదారి వెతుక్కున్నామంటే క్షణాల్లో రాజులా వెలిగిపోవచ్చు. కాకపోతే కాస్త రిస్క్ చేయాలి. అది చేయడానికీ సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ సాహసం ఏమిటి? హాయిగా జులాయిగా బతికేసే అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే 'జులాయి' చూడాల్సిందే.

సమర్పణ:
డి.వి.వి.దానయ్య. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట
శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి