22 జూన్, 2012

‘జులాయి’ రిలీజ్ డేట్, ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ డీటేల్స్




















అల్లు అర్జున్, ఇలియాన జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జులాయి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానని జులై 13న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఈచిత్రానికి సంబంధించిన ప్లాటినమ్ డిస్క్ వేడుకను జులైన 8న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూవీ పొడక్షన్ యూనిట్ ఈ వివరాలను కన్ ఫర్మ్ చేశఆరు.

ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈచిత్రాన్ని జులై 6న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అదే రోజు రాజమౌళి ‘ఈగ' చిత్రం విడుదల ఉండటంతో థియేటర్ల సమస్య కారణంగా వారం గ్యాప్ తీసుకుని ‘జులాయి' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కె. రాధకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన విషయం తెలిసిందే. గతంలో బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 ఆడియో ఘన విజయం సాధించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందనేది జులాయి చిత్రం స్టోరీ లైన్.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.

కామెంట్‌లు లేవు: